Revanth Reddy: మేం అందాల భామ‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం లేదు

Revanth Reddy satire on brs ktr

Revanth Reddy: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి BRS పార్టీపై సెటైర్ వేసారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న బందిపోటు దొంగ‌లు ఇప్ప‌టికీ ప‌బ్లిక్‌గానే తిరుగుతున్నార‌ని..  మూసీ ప‌రివాహ‌క ప్రాంత పున‌రుజ్జీవ‌నాన్ని అడ్డుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. BRS అధికారంలో ఉన్న‌ప్పుడు మూసీ బ్యూటిఫికేష‌న్ అని ఓ కాస్మెటిక్ డైలాగ్ పెట్టి ఏవేవో మాట్లాడార‌ని అన్నారు. తాము అందాల కోసం అందాల భామ‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం లేద‌ని.. ఇలాంటి విధానాలు BRS పార్టీ ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉన్న‌ట్లున్నాయ‌ని చుర‌క‌లంటించారు.