Suman: యాదాద్రి లాంటి అద్భుత‌ కట్టడం KCR వల్లే సాధ్యమైంది

suman good words about kcr and yadadri

Suman: యాదాద్రి క‌ట్ట‌డం తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి KCR వల్లే సాధ్య‌మైంద‌ని అన్నారు సినీ న‌టుడు సుమ‌న్.చ‌ఈ ఆలయం అభివృద్ధి కాకముందు ఎలా ఉండేదో త‌న‌కు తెలుస‌ని.. అందరూ ఎన్నో వ్యయ ప్రయాసలు పడేవారని అన్నారు. కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ గుడి లోపలికి వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుందని ఇంత అద్భుతమైన గుడిని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.