Supreme Court: న్యాయదేవత విగ్రహంలో మార్పులు
Supreme Court: కోర్టుల్లో మనకు కనిపించే న్యాయదేవత విగ్రహంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక మార్పులు చేసింది. సాధారణంగా న్యాయదేవత కళ్లకు గంతలు ఉంటాయి. కానీ కొత్త విగ్రహంలో ఆ గంతలు ఇక కనిపించవు. అంతేకాదు విగ్రహం ఎడమ చేతిలో ఉండే ఖడ్గానికి బదులు రాజ్యాంగాన్ని ఉంచారు. ఇది వరకు విగ్రహానికి మోడ్రన్ డ్రెస్ ఉండేది. కానీ ఆ డ్రెస్ తీసేసి చీరను డిజైన్ చేసారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ విగ్రహంలోని మార్పుల గురించి స్పందిస్తూ.. ఇక చట్టానికి కళ్లు ఉంటాయని.. ఆ కళ్లు అన్ని చట్టాలను చూడాల్సిందేనని అన్నారు. ఇది వరకు ఉండే ఖడ్గం హింసకు ప్రతిబింబిస్తోందని.. రాజ్యాంగ పుస్తకం ప్రకారమే న్యాయమూర్తులు తీర్పులు ఇస్తాయని తెలియజేయడానికే పుస్తకాన్ని అమర్చామని అన్నారు.