High Court: మైన‌ర్ ముందు సెక్స్.. పోక్సో చ‌ట్టం కింద నేర‌మే

Engaging In Sex In Front Of Minor Amounts to Harassment Under pocso

High Court: మైన‌ర్ ముందు త‌ల్లిదండ్రులు కానీ ఇత‌రులు ఎవ‌రైనా కానీ సెక్స్ చేయ‌డం అనేది పోక్సో చ‌ట్టం కింద నేర‌మే అవుతుంద‌ని సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది కేర‌ళ హైకోర్టు. మైన‌ర్ల ముందు న‌గ్నంగా ఉన్నా కూడా ఇదే వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించింది. ఓ కేసుకు సంబంధించిన వాదోప‌వాదాలు విన్నాక కోర్టు ఈ తీర్పునిచ్చింది. 2021 ఫిబ్ర‌వ‌రిలో ఫైస‌ల్ ఖాన్‌.. 16 ఏళ్ల మైన‌ర్ త‌ల్లితో ఓ లాడ్జిలో బాలుడి ముందే సెక్స్‌లో పాల్గొన్నాడు.

అయితే బాలుడిని బ‌య‌టికి పంపించి తాము శృంగార చ‌ర్య‌లో పాల్గొన్నామ‌ని.. బాలుడు ఉన్న‌ట్టుండి లోప‌లి రావ‌డంతో త‌మ‌ను న‌గ్నంగా చూసాడ‌ని ఫైజ‌ల్ తెలిపాడు. బాలుడు ఉన్న‌ట్టుండి గ‌దిలోకి రావ‌డంతో ఫైజ‌ల్ చేయిచేసుకున్నాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావ‌డంతో లాడ్జి సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు సమాచారం అందించారు. ఫైజ‌ల్‌తో పాటు బాలుడి త‌ల్లిపై నాలుగు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసారు. ఈ కేసును ప‌రిశీలించిన న్యాయ‌మూర్తి బ‌ద‌రుద్దీన్ ఈరోజు తీర్పు వెల్ల‌డిస్తూ.. మైన‌ర్ ముందు న‌గ్నంగా ఉన్నా శృంగార చ‌ర్య‌లో పాల్గొన్నా అది పోక్సో చ‌ట్టం కింద వేధింపే అవుతుంద‌ని.. ఈ కేసులోని ఇద్ద‌రు నిందితులు త‌గిన శిక్ష‌కు అర్హులేన‌ని తెలిపారు.