Etela Rajender: రేవంత్ BRSని చూసి నేర్చుకోవాలి

Etela Rajender says revanth must learn from brs

Etela Rajender: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి BRSని చూసి బుద్ధి తెచ్చుకోవాల‌ని అన్నారు భారతీయ జ‌న‌తా పార్టీ నేత ఈటెల రాజేంద‌ర్. ఇప్పటికే ఒక్కొక నియోజకవర్గానికి 4, 5 గురుకులాలు ఉన్నాయని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చి రేవంత్ కొత్తగా చేసేదేమీ లేద‌ని అన్నారు. కొత్తవి పెట్టడం మాట పక్కన పెడితే ఉన్న స్కూళ్లను మూసేయకుండా ఉంటే చాలని.. ఉన్న స్కూళ్లకు కొత్త భవనాలు ఇస్తే బాగుంటుంద‌ని అన్నారు. ముందు ఉన్న గురుకులాలకు సరిపోయే స్టాఫ్, టీచర్లు, వార్డెన్లను, వసతులు ఇవ్వాలని మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల‌ని డిమాండ్ చేసారు. ప్రతి ఏటా దాదాపు రూ.20 వేల కోట్లు మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తారని కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని మండిప‌డ్డారు. ఈ విష‌యంలో రేవంత్ BRSని చూసి నేర్చుకుంటే బాగుంటుంద‌ని సెటైర్ వేసారు.