Karimnagar: గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి
Karimnagar: గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు, జమునల కుమార్తె ఉక్కులు (5) నిన్న ఉదయం కళ్లు తిరిగి పడిపోయింది. చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా హన్మకొండకు రిఫర్ చేశారు. హన్మకొండలో వైద్యులు పరీక్షిస్తుండగా ఉక్కులు చనిపోయింది. అయితే చిన్నారికి పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉండొచ్చని, పేరెంట్స్ గుర్తించకపోవడంతో మృతి చెంది ఉంటుందని వైద్యులు తెలిపారు.