అందరిముందు ముద్దు.. ఆలియా ఓవరాక్షన్!
Mumbai: బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt)పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదో ఒక రకంగా ఆలియా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ట్రోల్స్ బారినపడి వార్తల్లో నిలిచింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆలియా భట్.. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) పోయిన ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టేసింది. పాపకి రాహా అని పేరు పెట్టారు. ఆలియా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన విశేషాలన్నింటినీ పంచుకుంటూ ఉంటుంది.
నిన్న వారిద్దరూ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా వారికి విషెస్ చెప్పేందుకు వచ్చారు. ఆలియా, రణ్‌బీర్ కారులో నుంచే ఫ్యాన్స్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అయితే రణ్‌బీర్ ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్తుంటే.. ఒక్కసారిగా ఆలియా రణ్‌బీర్‌కు ముద్దుపెట్టేసింది. దాంతో ఎంత భర్త అయినా అందరి ముందు అలా చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే వాళ్లు బయట కనిపించినప్పుడే అలా అతి చేస్తారనీ, ఇంట్లో మాత్రం వేరువేరుగా పడుకుంటారనీ కామెంట్ చేశారు. అంతేకాదు, ఆ వీడియో సరిగ్గా చూస్తే రణ్‌బీర్‌ని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆలియా చాలా ఇబ్బంది పడిందని, అలాంటప్పుడు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేయాలనీ అభిప్రాయపడుతున్నారు. ఇంకొకరైతే ‘దీపికా, కత్రీనా కూడా ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నువ్వు మాత్రం ఓవర్ యాక్షన్‌తో చంపేస్తున్నావు’ అంటూ రాసుకొచ్చారు. మరి ఈ ట్రోల్స్‌పై ఆలియా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.