“మేడం గారు సింగిల్ టేక్ తీసి సైలెంట్ అయిపోయారు”
Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచ కప్ విషయంలో స్కిప్పర్ హర్మన్‌ప్రీత్‌పై అందరూ మండిపడుతున్నారు. అసలు గేమ్ గురించి తెలుసా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు. హాఫ్ సెంచరీ కొట్టిన అనుభవాన్ని పెట్టుకుని.. కీలక సమయంలో సింగిల్ టేక్ తీసి మిగతా 12 రన్స్ కొత్త బ్యాటర్‌పై తోసేయడం ఎంత వరకు సమంజసం అంటూ మాజీ క్రికెటర్ గణేష్ దొడ్డా మండిపడ్డారు.
“” హర్మన్‌ప్రీత్ 50 పరుగులు తీసింది. కీలక సమయంలో సింగిల్ టేక్ తీసి కొత్త బ్యాటర్ వరుసగా 2 సిక్సులు బాదాలంట. ఇదేం లాజిక్. మేడం గారు కీలక సమయంలో మ్యాచ్ వదిలేసి కొత్త బ్యాటర్‌పై అంత బాధ్యతను పెట్టడమేంటో నాకు అర్థంకావడంలేదు. హర్మన్‌ప్రీత్ డెసిషన్ మేకింగ్ ఎంత గొప్పగా ఉందో ఇక్కడే అర్థంచేసుకోవచ్చు “” అని సెటైర్ వేసారు. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో.. ఆ తర్వాత మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.