జిమ్‌లో కుప్పకూలిన 24 ఏళ్ల కానిస్టేబుల్

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామంది గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. తాజాగా హైదరాబాద్​లోనూ ఈ తరహా సంఘటన జరగడంతో ప్రజల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. బోయిన పల్లికి చెందిన విశాల్​ (24) ఆసిఫ్ నగర్ పీఎస్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. విశాల్​ రోజూలానే ఇవాళ ఉదయం సికింద్రాబాద్ లోని ఓ జిమ్ కు వెళ్లాడు. ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడున్న వారు వెంటనే అతడిని  ఆస్పత్రికి తరలించగా అప్పటికే  గుండెపోటుతో చనిపోయినట్లు  వైద్యులు చెప్పారు.

గత కొన్నిరోజులుగా హార్ట్ ఎటాక్ ఘటనలు  ఆందోళన కల్గిస్తున్నాయి.  నిత్యం వ్యాయామం చేసేవారినీ కూడా  హార్ట్ ఎటాక్ వదలడం లేదు.  కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. పునీత్ నుంచి తారకరత్న దాకా గుండెపోటుతో మృత్యువాత పడ్డారు.  రెండు రోజలు క్రితం  హైదరాబాద్ పాతబస్తీలో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో  అందరితో నవ్వుతూ పలకరిస్తూ కూర్చుని కుప్పకూలిన ఘటన మరువకముందే ఇవాళ విశాల్  కూడా చిన్ని వయసులోనే చనిపోవడం ఆందోళన కల్గిస్తోంది.  అతి చిన్న వయస్సులోనే అతనికి గుండె పోటు రావడం భయాందోళన కలిగిస్తోంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. పునీత్, తారకరత్న నటుడు పునీత్ నుంచి తారకరత్న దాకా గుండెపోటుతో హార్ట్ ఎటాక్ తో చిన్న వయస్సులో కన్ను మూశారు. రెండు రోజలు క్రితం హైదరాబాద్ పాతబస్తీలో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి పెళ్లి వేడుకలో అందరితో నవ్వుతూ పలకరిస్తూ కూర్చుని కుప్పకూలిన ఘటన మరువకముందే ఇవాళ విశాల్ కూడా చిన్ని వయసులోనే చనిపోవడం అందరు ఆలోచించాల్సిన విషయం.

30 ఏళ్ల యువకుడు విజయవాడ చెందిన 25 ఏళ్ల యువకుడు ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇటీవల ఛాతీ నొప్పికి గురవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ యువకుడిని పరీక్షించి గుండె పోటు వచ్చిందని చెప్పారు. అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో బతికాడు. హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల యువకుడు ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి సిగరెట్, మద్యం అలవాటు ఉంది. ఇటీవల డ్యూటీకి బయలుదేరుతూ ఛాతీలో నొప్పి అనడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే అతను ప్రాణాలు విడిచాడు. ఈ వరుస ఘటనలకు కారణం కరోనా అనంతర ప్రభావాలేననే వాదన కూడా వినిపిస్తోంది.