Lifestyle: సెక్స్‌కి ముందు తినకూడనివి
Lifestyle: వ్యాయామానికి ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదు అంటారు. ఇదే రూల్ శృంగారానికి కూడా వర్తిస్తుంది. సెక్స్ చేసే ముందు తినకూడని కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఉల్లి వెల్లుల్లి – ఇవి తినగానే నోరంతా భరించలేని వాసన వస్తుంది. సెక్స్‌కి ముందు తింటే కోరిక చచ్చిపోయి అసంతృప్తి మిగులుతుంది.
బీన్స్ – బీన్స్ వల్ల గ్యాస్ పెరుగుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. శృంగార చర్యను ఎంజాయ్ చేయలేరు
పాల పదార్థాలు – పాల పదార్థాలు కూడా గ్యాస్, కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి.
మద్యం – చాలా మంది మద్యం తాగాక సెక్స్‌లో పాల్గొంటూ ఉంటారు. కానీ మితంగా తీసుకోవాలి. ఎక్కువగా సేవిస్తే ఆ చర్యలో సరిగ్గా పాల్గొనలేరు.
కెఫీన్ – కాఫీలు, టీలు సెక్స్‌కి ముందు వద్దు. దీని వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అనవసర ఆతృత పెరిగిపోయి ఏమీ చేయలేరు.
స్పైసీ ఆహారాలు – కారంతో కూడుకున్న ఆహారాలు తింటే గుండెలో, కడుపులో మంటగా ఉంటుంది.