ఎవరెస్ట్ కంటే అతిపెద్ద పర్వతం..!
Mount Everest: ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం ఏది అని అడిగితే ఎవరెస్ట్ అని ఠక్కున చెప్పేస్తారు. కానీ మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్ద పర్వతం ఒకటి ఉంది. కాకపోతే ఈ పర్వతం భూమి మీద లేదు. అంగారకుడిపై ఉంది. ఈ పర్వతం పేరు ఒలింపస్ మోన్స్. దీని పొడవు 25 కిలోమీటర్ల మేరు ఉంటుంది. అంటే ఎవరెస్ట్ కంటే మూడు రెట్లు ఎక్కువ. ఈ ఒలింపస్ మోన్స్ అతిపెద్ద పర్వతమే కాదు.. ఈ సౌర కుటుంబంలోనే అతిపెద్ద అగ్ని పర్వతం కూడా. దీని విస్తరణ అమెరికాలోని అరిజోనా ప్రాంతం ఉన్నత ఉంటుందట. అంటే దాదాపు 601 కిలోమీటర్లు. ఈ పర్వతం నుంచి 250 లక్షల సంవత్సరాల క్రితం లావా ఒప్పొంగింది. ఇప్పటికీ ఆ లావా యాక్టివ్‌గానే ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి అంగారకుడిపై ఉండదు. చాలా తక్కువ. అందుకే పర్వతాలు అడ్డూ అదుపూ లేకుండా అలా విరగకుండా పెరిగిపోతూనే ఉంటాయి.