Border Gavaskar Trophy: షమీని తేలేం
Border Gavaskar Trophy: నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి స్టార్ బౌలర్ మహ్మద్ షమీని తీసుకురాలేమని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించారు. షమీ కాలికి తీవ్రంగా గాయమైందని.. తాను చూసినప్పుడు కాలు వాచిపోయి ఉందని అన్నారు. షమీ 100 శాతం ఫిట్‌గా ఉంటే తప్ప నిర్ణయం తీసుకోలేమని తెలిపారు.
“” ప్రస్తుతం షమీ NCAలో వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నాడు. నేను చూసినప్పుడు షమీ కాలు వాచిపోయి ఉంది. ఇప్పటికిప్పుడు 100% ఫిట్‌గా ఉన్నా కూడా ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడతాడన్న గ్యారెంటీ ఇవ్వలేను. కాబట్టి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి షమీని తీసుకురాలేం. షమీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే జాతీయ స్థాయిలో ఆడాలి. బోర్డర్ ట్రోఫీలో స్టార్ బౌలర్ టీంలో లేకపోతే ఆ లోటు ఎలా ఉంటుందో మాకు తెలుసు “” అని తెలిపారు.