Chat GPT దాహం తీర్చడానికి లక్షల లీటర్ల నీరు!
Hyderabad: ఓ టెక్నాలజీ టూల్‌కి(chat gpt) నీటికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీ(chat gpt). దీనిని ఇప్పటికే కొన్ని కోట్ల మంది యూజర్లు వాడేస్తున్నారు. రోజులో కొన్ని లక్షల ప్రశ్నలు అడుగుతుంటారు. మరి అంత డేటా మొత్తం అది బ్యాకెండ్‌లో రన్ చేసుకోవాలంటే అవి వేడెక్కిపోతుంటాయి. ఆ డేటా సెంటర్లను కూల్ చేయడానికి నీటిని ఉపయోగిస్తారట.
చాట్ జీపీటీ డేటా సెంటర్లను కూల్ చేయడానికి కొన్ని వేల లీటర్ల నీరు కావాలి. ఒక్క చాట్ జీపీటీ-3కి ట్రైన్ చేయడానికే 700,301 లీటర్ల నీరు అవసరం అవుతాయని టెక్ సైంటిస్టులు చెప్తున్నారు. ఈ నీటితో ఓ న్యూక్లియర్ రియాక్టర్‌ను కూల్ చేయొచ్చట. ఒకవేళ ఏషియాలోని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను కూల్ చేయడానికి నీటిని వాడాల్సి వస్తే లెక్క అంతకుమించే ఉంటుంది. రోజులో 20 నుంచి 50 ప్రశ్నలకు చాట్ జీపీటీ సమాధానం చెప్పడానికి 500 మిల్లీ లీటర్ల వాటర్ కావాలి. 500 మిల్లీ లీటర్లు పెద్ద లెక్క కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్నారు కాబట్టి నీటి వాడకం కూడా అంతే ఉంటుంది. గూగుల్(google), మైక్రోసాఫ్ట్(microsoft) వంటి కంపెనీలు నీటి వాడకంపై అవగాహన కలిగి ఉండాలని, వాడుతున్న నీటికి కంపెనీలే బాధ్యుత వహించాలని పరిశోధకులు అంటున్నారు.