NBK108: యాక్షన్​తో అదరగొట్టనున్న‌ బాలయ్య.. వీడియో లీక్​!

Hyderabad: ఈ ఏడాది ఆరంభం నుంచీ నందమూరి బాలకృష్ణ(Balakrishna) మంచి జోష్​లో ఉన్నారు. ఓవైపు వీరసింహా రెడ్డి(Veera Simha Reddy) హిట్​తో యాక్షన్​ సినిమాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకుని, మరోవైపు అన్​స్టాపబుల్​ సీజన్​ 2తో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు తన 108వ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్​ అనిల్ రావిపూడి(Anil Ravipudi) రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలంగాణ(Telangana) బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే అనిల్ హింట్​ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రిలీజ్​ చేసిన బాలయ్య లుక్​కి అదిరిపోయే రెస్పాన్స్​ వచ్చింది. బాలయ్య డైలాగ్స్ అంటేనే ఫుల్​ జోష్​లో ఉంటాయి. అలాంటిది ఆ మాస్ డైలాగ్స్ ని తెలంగాణ యాసలో చెబితే ఇంకెలా ఉంటుందో అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

ఇక, ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం (ఏప్రిల్ 14) హైదరాబాద్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాన్ని తెరక్కించనున్నారట. ఇక సెట్స్ నుంచి ఒక వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో ఫైట్ కోసం ఉస్ చేసే క్రేన్, రోప్స్ అండ్ సెట్ ప్రోపర్టీస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది. థమన్​ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు బాలకృష్ణ.