Resignation Letter: వేరే జాబ్ వ‌చ్చింది.. వైర‌ల‌వుతున్న లెట‌ర్

this Resignation Letter is going viral on internet

Resignation Letter: సాధార‌ణంగా రాజీనామా లేఖ‌లు ఎలా ఉంటాయ్‌? ఇప్ప‌టివ‌ర‌కు కంపెనీ కోసం ప‌నిచేసి చాలా అనుభ‌వం తెచ్చుకున్నాను.. ఇక‌పై నేను ఈ ఉద్యోగాన్ని మానేయాల‌నుకుంటున్నాను.. ఇలా కాస్త ఫ్రెండ్లీగా రాసి మెయిల్ పెడుతుంటారు. తిడుతూ రాజీనామా చేసేవారి సంఖ్య కూడా ఈ మ‌ధ్య పెరిగిపోతోంది. అయితే.. ఓ ఉద్యోగి పెట్టిన రాజీనామా లేఖ మాత్రం ఇంట‌ర్నెట్‌లో తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి అత‌ను రాసిన లేఖ అలాంటిది. ఇంత‌కీ ఆ లేఖ‌లో ఏమ‌ని రాసాడంటే.. స‌ర్‌.. నాకు వేరే కంపెనీలో మంచి ఉద్యోగం రావ‌డంతో ఇక్క‌డ మానేయాల‌ని అనుకుంటున్నాను. నాకు అక్క‌డ న‌చ్చ‌క‌పోతే మ‌ళ్లీ ఇదే కంపెనీకి వ‌స్తాను. అప్పుడు న‌న్ను తీసుకోండి. నాకు అన్ని విధాలా సాయ‌ప‌డినందుకు మేనేజ్‌మెంట్‌కు ధ‌న్య‌వాదాలు అని రాసాడు. రాసిన వ్య‌క్తి ఎవ‌రో కానీ.. ఆ హెచ్ఆర్ ఈ రాజీనామా లెట‌ర్‌ను ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో తెగ న‌వ్వులు పూయిస్తోంది.