Pawan Kalyan: మీరు OG అంటుంటే నాకు మోదీ అని వినిపిస్తోంది

pawan kalyan says he hears modi when people shout og

Pawan Kalyan: చాలా కాలం పాటు జ‌నాలు OG OG అని అరుస్తుంటే త‌న‌కు మోదీ మోదీ అని వినిపించేదంటూ వ్యాఖ్యానించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.  ప‌ల్లె పండుగ వారోత్స‌వాల సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ ఈ కామెంట్ చేసారు.

“” ప‌ల్లెల్లో రోడ్లు బాగుంటేనే అంద‌రూ బాగుంటార‌ని ఆయ‌న తెలిపారు. నేను అందరూ హీరోలు బాగుండాలని కోరుకుంటాను. నేను ఎవ్వరితో పోటీ పడను, ప్రతీ ఒక్కరికీ వారిదంటూ ఒక శైలి ఉంది. నాకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మ‌హేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రామ్ చ‌ర‌ణ్‌ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు ఇతర ప్రతీ హీరో అన్నా కూడా ఇష్టమే, వారి సినిమాలు విజయం సాధించాలని, మీరు అనందపడాలని కోరుకుంటాను. కానీ మీరు సినిమాలు చూడాలంటే ముందు మీ దగ్గర సంపాదన ఉండాలి కదా, అది సృష్టించడం కోసం మేము పనిచేస్తాం. అభిమానుల కోరిక కూడా నాకు తెలుసు, నాకు ప్రజల సమస్యల పరిష్కారం ఎక్కువ ఆనందం ఇస్తుంది.

మీ సమస్యల పరిష్కారం తో పాటుగా మీ ఆనందం కూడా ముఖ్యమే, నేను మరింత బలంగా పనిచేయాలన్నా, ఎవరికైనా సహాయం చేయాలన్నా ఆర్థికంగా నాకు సినిమాలు ఒక్కటే అప్పది కపట్టి తీరిక సమయంలో చేసి మిమ్మల్ని ఆనందింప చేస్తాను. మోదీ గారు అంటే నాకు చాలా గౌరవం. వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఏరోజు నా కోసం ఏమీ అడగను, కానీ సమీప భవిష్యత్తులో మచిలీపట్నం నుండి రేపల్లె వరకు రైల్వే లైన్ ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తామని మాటిస్తున్నాను. మన కూట‌మి ప్ర‌భుత్వంలో ఏదీ గుట్టుగా ఉండ‌దు. అన్నీ పార‌ద‌ర్శ‌కంగానే జ‌రుగుతాయి. అందుకే ఓ అధికారి నా పేరుతో లంచాలు ఆశించడం.. ఈ విషయాన్ని ప్రజలు మా డిప్యూటీ సీఎం పేషీకి తీసుకురావడంతో ఆ అధికారిపై చర్యలు తీసుకొని, ఆ అధికారి తప్పు చేస్తే సస్పెండ్ చేయాలని ఆదేశించాను“” అని తెలిపారు.