తెలుగు యువ‌కుడిని చంపిన అమెరిక‌న్‌కు 60 ఏళ్ల కారాగార శిక్ష‌

man who killed varun tej pucha gets 60 years jail

Varun Tej Pucha: అమెరికాలో చదువుకుంటున్న ఓ తెలుగు యువ‌కుడిని దారుణంగా కొట్టి అత‌ని చావుకు కార‌ణ‌మైన వ్య‌క్తికి అక్క‌డి న్యాయ‌స్థానం 60 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని ఇండియానాలో ఉన్న వాల్ప‌రైసో యూనివ‌ర్సిటీలో ఎంఏ చ‌దువుకుంటున్న ఖ‌మ్మంకు చెందిన వ‌రుణ్ తేజ్ పుచ్చా అనే యువ‌కుడు జిమ్‌లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు.

గ‌తేడాది అక్టోబ‌ర్ 29న ఆండ్రేడ్ అనే 25 ఏళ్ల అమెరిక‌న్.. వ‌రుణ్ తేజ్ వికృతంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని పొర‌బ‌డి అత‌ని త‌ల‌పై క‌త్తితో దాడి చేసాడు. దాంతో వ‌రుణ్ అక్క‌డికక్క‌డే కుప్పకూలిపోయాడు. స్థానికుల స‌మాచారంతో వెంట‌నే వ‌రుణ్‌ను హాస్పిట‌ల్‌కు చేర్పించిన పోలీసులు ఆండ్రేడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్లాడిన వ‌రుణ్ ప్రాణాలు వదిలాడు. వ‌రుణ్ చావుకు కార‌ణ‌మైన ఆండ్రేడ్‌కు అక్క‌డి న్యాయ‌స్థానం 60 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధించింది. ఇంకో రెండు నెల‌ల్లో వ‌రుణ్ త‌న చ‌దువు పూర్తి చేసుకుని తిరిగి ఖ‌మ్మం రావాల్సి ఉండ‌గా అత‌ను చ‌నిపోవ‌డం బాధాక‌రం.