జ‌న‌సేన కార్య‌క్ర‌మంలో YSRCP మాజీ ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్

rapaka varaprasad to join tdp

Rapaka Varaprasad: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ తెలుగు దేశం పార్టీలోకి వెళ్లే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన జ‌న‌సేన కార్య‌క్ర‌మంలో క‌నిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. జ‌న‌సేన ఎమ్మెల్యే దేవ వ‌ర‌ప్ర‌సాద్‌తో రాపాక భేటీ అయ్యారు. దాంతో ఆయ‌న జ‌న‌సేన ద్వారా తెలుగు దేశంలోకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌లికిపురంలో జ‌రిగిన జ‌న‌సేన వాలంటీర్ల కార్య‌క్ర‌మంలో ఉన్న‌ట్టుండి రాపాక వ‌ర‌ప్ర‌సాద్ స్టేజ్‌పైకి ఎక్కి అక్క‌డే ఉన్న దేవ‌వ‌ర‌ప్ర‌సాద్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డంతో అక్క‌డున్న జ‌న‌సేన నేత‌లు కూడా షాక‌య్యారు. అంద‌రి ముందు నువ్వెందుకు వ‌చ్చావ్ అంటే బాగోద‌ని ప‌ల‌క‌రించాల్సి వ‌చ్చింద‌ట‌.

గ‌త కొంత‌కాలంగా రాపాక వైఎస్సార్ కాంగ్రెస్ ప‌ట్ల‌, జ‌గ‌న్ ప‌ట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. రాజోలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌కుండా ఎంపీ టికెట్ ఇవ్వ‌డం ఆయ‌న‌కు నచ్చ‌లేదు. అప్ప‌టి నుంచే ఆయ‌న పార్టీ కార్య‌క‌లాపాల ప‌ట్ల దూరంగా ఉంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక ఉన్నారు. అక్క‌డ గెలిచిన త‌ర్వాత కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అప్ప‌టినుంచి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రాపాక‌పై కోపంతో ఉన్నారు. అలాంటిది ఆయ‌న ఉన్న‌ట్టుండి మ‌లిక‌పురం జ‌న‌సేన కార్య‌క్ర‌మంలో రాపాక రావ‌డంతో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.