ఇదేం ట్విస్ట్..జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన యువతిపై యువ‌కుడి ఫిర్యాదు

case filed on jani master victim

Jani Master: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. జానీపై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పుడు తాను మైనర్‌నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.