స్నేహితుడి ప్రేమ కోసం ఇద్ద‌రు యువ‌కుల రిస్క్

3 boys steal a car for girlfriend

Viral News: ఓ యువ‌కుడు తన గ‌ర్ల్‌ఫ్రెండ్‌ని కారులో బ‌య‌టికి తీసుకెళ్లాల‌ని అనుకున్నాడు. కానీ పాపం వాడి ద‌గ్గ‌ర కారు లేదు. ఈ విష‌యాన్ని త‌న ఇద్ద‌రు స్నేహితుల‌తో చెప్ప‌గా.. వాళ్లిద్ద‌రూ స్నేహితుడి కోసం రిస్క్ చేయాల‌నుకున్నారు. ఇందుకోసం ఓ షోరూంకి వెళ్లి టెస్ట్ డ్రైవ్ పేరుతో కారు దొంగిలించి బుక్క‌య్యారు. ఈ ఘ‌ట‌న గ్రేట‌ర్ నోయిడాలో చోటుచేసుకుంది. శ్రేయ్, అనికేత్, దీపాన్షు అనే ముగ్గురు స్నేహితులు స్థానిక యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటున్నారు. అనికేత్ అదే యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న ఓ అమ్మాయిని ఇష్ట‌ప‌డ్డాడు.

ఆ అమ్మాయిని కారులో బ‌య‌టికి తీసుకెళ్లాల‌నుకున్నాడు. త‌న ద‌గ్గ‌ర కారు లేక‌పోవ‌డంతో శ్రేయ్, దీపాన్షులు క‌లిసి అనికేత్ కోసం ఓ కారును దొంగ‌లించాల‌నుకున్నారు. ఇందుకోసం ప్లాన్ ప్ర‌కారం హెల్మెట్లు వేసుకుని దగ్గ‌ర్లోని కారు షోరూంకి వెళ్లారు. ఓ కారుని చూసి బాగుంది టెస్ట్ డ్రైవ్ చేస్తామ‌ని చెప్పారు. వారి మాట‌లు న‌మ్మి షో రూంలోని ఓ వ్య‌క్తి కూడా కారు ఎక్కి ఆ ఇద్ద‌రు అబ్బాయిల‌ను కూడా ఎక్కించుకున్నాడు. ప్లాన్ ప్ర‌కారం కారు కొద్ది దూరం వెళ్ల‌గానే ఆ డ్రైవ‌ర్‌ని కారులో నుంచి బ‌య‌టికి తోసేసి వారు కారుతో పరార‌య్యాడు. ఈ విష‌యాన్ని షోరూం అధికారులు పోలీసుల‌కు చెప్ప‌డంతో ముగ్గురు యువ‌కుల‌నీ అదుపులోకి తీసుకున్నారు.