Donald Trump: నేను గెలిస్తే భార‌త్‌కూ ఆ భారం త‌ప్ప‌దు

donald trump says India imposes the highest tariffs on foreign products

Donald Trump: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఒక‌వేళ తాను గెలిస్తే భార‌త్‌పైనా సుంకాల మోత త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంద‌ని అన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా వ‌స్తువుల‌పై అత్య‌ధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భార‌త్ మొద‌టి స్థానంలో ఉంద‌ని.. కొన్ని సంద‌ర్భాల్లో చైనా విధించే సుంకాల క‌న్నా భార‌త్ సుంకాలే ఎక్కువ‌గా ఉంటాయ‌ని గెలిచాక తాను కూడా సుంకాలు పెంచుతాన‌ని అన్నారు.

అమెరికాకి చెందిన ప్ర‌ముఖ బైక్‌ల త‌యారీ కంపెనీ హార్లే డేవిడ్‌స‌న్ యాజ‌మాన్యం భార‌త్ విధిస్తున్న సుంకాల‌పై త‌న‌కు ఫిర్యాదు చేసింద‌ని తెలిపారు. ఈ కంపెనీకి చెందిన మోట‌ర్ సైకిళ్ల‌పై భార‌త్ 150 శాతం సుంకాలు విధిస్తోంద‌ని దీని వ‌ల్ల భార‌త్‌లో హార్లే డేవిడ్‌స‌న్ బైక్‌లు అమ్మ‌లేక‌పోతున్నామ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిపారు. ఒక‌వేళ భార‌త్‌లో హార్లే డేవిడ్‌స‌న్ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటుచేస్తే అప్పుడు సుంకాలు భారీగా త‌గ్గిస్తామ‌ని భార‌త్ ప్ర‌స్తావ‌న తెచ్చిన‌ప్ప‌టికీ ఇందుకు గ‌తంలో ట్రంప్ ఒప్పుకోలేదు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గొప్ప నేత‌, త‌న‌కు మంచి స్నేహితుడు అని వ్యాఖ్య‌లు చేసిన మ‌రుస‌టి రోజే భార‌త్ అమెరికా వ‌స్తువుల‌పై విధిస్తున్న సుంకాల గురించి ట్రంప్ ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.