ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్‌లపై కేంద్రం కీలక నిర్ణయం
Amrapali: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ IAS అధికారులు ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్‌ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీరిద్దరూ వెంటనే స్వరాష్ట్రం (AP)లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా IAS అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం నిన్న పంపించింది.