Ratan Tata: సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే.. టాటా పేల్చిన జోకులు
Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త తెలివి తేటలు, మంచి మనసే కాదు.. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. ఆయన పలు సందర్భాల్లో సునాయాసంగా ఎన్నో జోక్స్ పేల్చి నవ్వించారు.
నేను సరైన నిర్ణయాలు తీసుకోను.. తీసుకున్న నిర్ణయాలనే సరి చేసుకుంటా అని రతన్ టాటా పలుమార్లు చెప్పారు. దాంతో చాలా మంది అది ఆయన సృష్టించిన వాఖ్యమే అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది.. ఆయన ట్విటర్, ఫేస్బుక్లో చూసి కాపీ కొట్టారని. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించంతో అందరూ అవాక్కయ్యారు.
ఓ సందర్భంలో ఓ అమ్మాయి రతన్‌కు ఓ ప్రశ్న వేసింది. మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసే విషయం ఏంటి అని. దీనికి రతన్ సమాధానమిస్తూ.. దీనికి సమాధానం నేను నలుగురిలో ఉన్నప్పుడు చెప్పలేను అన్నారు.
మరో ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినిమాలపై రతన్ టాటా సెటైర్ వేసారు. భారతదేశంలోని రెస్టారెంట్లలో వాడే టొమాటో కెచప్ బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు.