Ratan Tata: ర‌త‌న్ టాటా చివ‌రి మాట‌లివే

Ratan Tata last words

Ratan Tata: దేశం మెచ్చిన వ్యాపార‌వేత్త ర‌త‌న్ టాటా నిన్న రాత్రి 11:30 క‌న్నుమూసారు. సాధార‌ణ చెక‌ప్ నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించామ‌ని చెప్పినా ఆయ‌న ఆరోగ్యం నిన్న విష‌మించింది. ఈ నేప‌థ్యంలో ర‌త‌న్ టాటా త‌న అభిమానుల‌తో పంచుకున్న చివ‌రి మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

“” నా గురించి ఆలోచిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు. నా ఆరోగ్యం గురించి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురితం అవుతున్నాయి. నాకు వ‌య‌సైపోతుండ‌డంతో సాధార‌ణ మెడిక‌ల్ చెక‌ప్స్ నిమిత్తం హాస్పిట‌ల్‌కు వెళ్లాను. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ద‌య‌చేసి నా ఆరోగ్యం గురించి త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చురించ‌వద్దు “” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పెట్టిన 24 గంట‌ల్లోనే టాటా క‌న్నుమూయ‌డం బాధాకరం.