నాగార్జునను మిండగాడు అన్నావ్.. సారీ చెప్పావా?
Chitti Babu: అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్‌లో ఉందంటూ హైడ్రా కూల్చివేతలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత చిట్టిబాబు స్పందించారు.
“” ఎన్ కన్వెన్షన్ కట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ నిర్మాణం బఫర్ జోన్‌లో జరుగుతున్నప్పుడు బలిసి పర్మిషన్లు ఇచ్చారా? తాగిన మైకంలో ఇచ్చారా? రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చామని బయటికి వచ్చి చెప్పే ధైర్యం ఉందా? ముందు అనుమతులు ఇచ్చినవారిపై చర్యలు తీసుకుని అప్పుడు నాగార్జునకు నోటీసులు పంపితే దానికో అర్థముంది. ఇక కొండా సురేఖ విషయానికొస్తే నాగార్జునను పట్టుకుని మిండగాడు అన్నావ్. మరి ఆయనకు సారీ చెప్పావా?
నీ పాటికి నువ్వు దరిద్రమైన కామెంట్స్ చేసేసి ట్విటర్‌లో సారీ సమంత అంటే సరిపోతుందా? ఈ మహేష్ కుమార్ గౌడ్‌కి తెలుగు రాదనుకుంటా. అసలు సురేఖ సరిగ్గా క్షమాపణలు చెప్పి ఉంటే సినిమా వాళ్లు కూడా ఇంత హర్ట్ అయ్యేవారు కాదు. ఒక మంత్రిగా ఏ ఆధారాలతో మాట్లాడావు? కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేసాడు అన్నావ్. సాక్ష్యాలు ఉన్నాయా? రకుల్‌ని బెడ్‌రూంకి తీసుకెళ్లాడు అన్నావ్? సాక్ష్యం ఉందా? పైగా వ్యాఖ్యలను సురేఖ వెనక్కి తీసుకోలేదు. సమంతకి సారీ చెప్పి క్షమాపణలు చెప్పేసాను అంటే కుదరదు. ఈ కాంగ్రెస్ నేతలకు విజ్ఞత, తెలివి అనేది లేదు. మీ రాజకీయాలు మురికి గుంటలో పాకే పురుగుల్లా ఉంటాయ్. ప్రతీదానికి మేం బయటికి వచ్చి మాట్లాడాలా? మాకు వేరే పని లేదా?
జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడని ఒక వర్గం వారు ఏడుస్తున్నారు. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు సమంతను అంటే ఎందుకు స్పందించారు అంటున్నారు. అసలు ఇదేం పోలిక? సమంత, నాగార్జున, రకుల్ సినిమా వాళ్లు కాబట్టి సాటి కొలీగ్‌గా తారక్ స్పందించాడు. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరమైనవి. మాకు రాజకీయాలతో ఏం సంబంధం? అలా అంటే మొన్న ఎవడో జగన్ రెండో భార్యకు పుట్టాడు అన్నారు. మరి దానిపై కూడా మేం స్పందించాలా? ఏం మాట్లాడతారయ్యా అర్థంపర్థం లేకుండా“” అని వెల్లడించారు.