Divvela Madhuri: నాకు జ‌న‌సేన నుంచి పిలుపొచ్చింది

i got a call from janasena says divvela madhuri

Divvela Madhuri: రాజ‌కీయంగా తాను ఎద‌గాల‌నుకుంటే ఎవ్వ‌రి మ‌ద్ద‌తు లేకుండా కూడా ఎద‌గ‌గ‌లన‌ని అన్నారు టెక్క‌లి వైఎస్సార్ కాంగ్రెస్ నేత దివ్వెల మాధురి. వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి ఫ్యామిలీ డ్రామా రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.  కోర్టులో వేసిన విడాకుల కేసు ఓ కొలిక్కి వ‌స్తే తామిద్ద‌రం పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు మాధురి తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆమె ఓ స‌ర్‌ప్రైజింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. త‌న‌కు తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల నుంచి కూడా త‌మ పార్టీలో చేరాల‌ని కాల్స్ వ‌చ్చాయ‌ని.. కానీ త‌మ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఉన్న అభిమానంతో టెక్క‌లి ప్రాంత అధ్య‌క్షురాలి ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి ఓ కార్య‌క‌ర్త‌లా శ్రీనివాస్ వెంట ఉండి పార్టీలో ప‌నిచేస్తున్నాన‌ని తెలిపారు.