Pushpa 2 కోసం గేమ్ ఛేంజ‌ర్ వాయిదా

game changer to postpone for pushpa 2

Pushpa 2: అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప 2 కోసం రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమాను వాయిదా వేయ‌నున్నారా? అవున‌నే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పుష్ప 2 సినిమాకి చెబుతున్న భారీ రేట్లకి కనీసం రెండు మూడు వారాలు ఫ్రీ రన్ ఉండాలి అని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదే విష‌యాన్ని గేమ్ ఛేంజ‌ర్ నిర్మాత‌ల‌తో చ‌ర్చించి వాయిదా వేసుకోవాల్సిందిగా కోరారు. వారు కూడా వెంటనే సరే అని సాధ్యాసాధ్యాలని ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది.