“మీరూ మీ ఎద‌వ ఓవ‌రాక్ష‌న్”

aap wants to go solo in delhi elections

AAP: ఇండియా కూట‌మి ద్వారా భార‌తీయ జ‌న‌తా పార్టీని గద్దె దించాల‌ని అన్ని పార్టీలు ఒకే తాటి మీద‌కు వ‌చ్చి కాంగ్రెస్‌తో చేతులు క‌లిపాయి. కానీ హ‌ర్యాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసాక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఇత‌ర పార్టీలు ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకుని తిట్ట‌డం మొద‌లుపెట్టాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్‌తో చేతులు క‌లిపిన అర‌వింద్ కేజ్రీవాల్.. హ‌ర్యాణాలో భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎలాగైనా ఓడించాల‌ని కసి తీరా ప్ర‌చారం చేసారు. తీరా చూస్తే హ‌ర్యాణా భార‌తీయ జ‌న‌తా పార్టీకి హ్యాట్రిక్ గెలుపునిచ్చింది. దాంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌పై మండిప‌డుతోంది. మీరూ మీ ఎద‌వ ఓవ‌రాక్ష‌న్.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ వ‌ల్లే హ‌ర్యాణాలో ఓడిపోయాం. ఇక చాలు బాబు. ఫిబ్ర‌వ‌రిలో ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఉన్నాయి. మేం ఒంట‌రిగానే పోటీ చేస్తాం అని కాంగ్రెస్‌కు తేల్చి చెప్పేసారు.

గ‌త ప‌దేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసిన మంచి ప‌నులే ఓట్లు తెచ్చిపెడ‌తాయ‌ని.. ఏ పార్టీతోనూ త‌మ‌కు పొత్తు అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పేసింది. గ‌త ప‌దేళ్లుగా కాంగ్రెస్‌కి ఢిల్లీలో ఒక్క సీటు లేక‌పోయినా మూడు లోక్ స‌భ స్థానాలు ఇచ్చామ‌ని.. కానీ హర్యాణాలో మాత్రం ఆప్‌కు ఒక్క స్థానం కూడా ఇవ్వ‌కుండా ఒంట‌రిగా బ‌రిలోకి దిగార‌ని.. దాంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌యకేత‌నం ఎగ‌రేసిందని అర‌వింద్ కేజ్రీవాల్ మండిప‌డుతున్నారు. అదే ఆప్‌కి కొన్ని సీట్లు ఇచ్చినా భార‌తీయ జ‌న‌తా పార్టీ అంతు చూసేవాళ్ల‌మ‌ని అన్నారు.