Vanasthalipuram: 100కు కాల్ చేసిన మహిళపై హెడ్ కానిస్టేబుల్ అఘాయిత్యం

police constable tried to rape woman in vanasthalipuram

Vanasthalipuram: 100కి కాల్ చేస్తే పోలీసులు వ‌చ్చి ర‌క్షిస్తార‌ని అనుకుంటాం. కానీ పోలీసే వ‌చ్చి అఘాయిత్యానికి పాల్ప‌డితే. ఇలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో చోటుచేసుకుంది. వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ తన ఇంటి పక్కన గొడవ జ‌రుగుతోంద‌ని 100కు కాల్ చేసింది. దీంతో కానిస్టేబుల్ జగన్ ఇంటికొచ్చి మాట్లాడుతూ ఆమెతో మెల్లిగా పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి నుంచి డ‌బ్బు కూడా తీసుకున్నాడు. ఆ డ‌బ్బు తిరిగి ఇవ్వ‌క‌పోగా చివరకు ఇంజాపూర్ తీసుకెళ్లి అఘాయిత్యం చేయ‌బోయాడు. బాధితురాలు ఎలాగోలా తప్పించుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది.