Nizamabad: ఎంత దారుణం.. రోగిని ఈడ్చుకెళ్లి..
Nizamabad: నిజామాబాద్(nizamabad)లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడిని హాస్పిటల్‌కి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఇందుకు కారణం ఆ హాస్పిటల్లో స్ట్రెచర్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం. ఈ ఘటన నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగింది. ఓ పేషెంట్ నడవలేని స్థితిలో ట్రీట్మెంట్కు హాస్పిటల్‌కు వచ్చాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి లిఫ్ట్, స్ట్రెచర్ వాడకుండా బంధువులు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. దాంతో పోలీసులు ఆరా తీయడంతో.. హాస్పిటల్‌కు స్ట్రెచర్ లేకపోవడంతో ఈడ్చుకెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. కనీసం నర్సులు ఓ వీల్‌ఛైర్ కూడా ఇవ్వలేదని వాపోయారు.