Mahesh Namrata: న‌మ్ర‌త మ‌హేష్‌ని ఏమ‌ని పిలుస్తారో తెలుసా?

namrata calls mahesh babu baby

Mahesh Namrata: మ‌హేష్ బాబుని ఫ్యాన్స్ అంతా ముద్దుగా ప్రిన్స్, సూపర్‌స్టార్ అని పిలుచుకుంటారు. మ‌రి ఆయన స‌తీమ‌ణి న‌మ‌త్ర ఏమ‌ని పిలుస్తారో తెలుసా. డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఓసారి మ‌హేష్‌, న‌మ్ర‌త‌ల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న స‌మ‌యంలో ఇదే ప్ర‌శ్న‌ను మ‌హేష్‌ను అడిగారు. మిమ్మ‌ల్ని న‌మ్ర‌త ఏమ‌ని పిలుస్తారు అని. ఇందుకు మ‌హేష్ స‌మాధానం చెప్ప‌లేదు. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ విష‌యాలు ప‌ర్స‌న‌ల్‌గా ఉంచితేనే బాగుంటుంది అని మ‌హేష్ భావిస్తారు. మ‌హేష్ నుంచి ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం రాద‌ని తెలిసి పూరీ జ‌గ‌న్నాథ్ న‌మ్ర‌త‌ను అడిగారు. దీనికి న‌మ్ర‌త నుంచి సమాధానం రావ‌డంతో మ‌హేష్ షాక్ అయ్యారు. న‌మ్ర‌త మ‌హేష్‌ను ముద్దుగా బేబీ అని పిలుస్తార‌ట‌.