వ్లాదిమిర్ పుతిన్ పుట్టినరోజు.. ఉక్రెయిన్ కానుక
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తన 72వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు శత్రు దేశమైన ఉక్రెయిన్ పుట్టినరోజు కానుకిచ్చింది. రష్యన్ స్టేట్ మీడియా కంపెనీ అయిన VGTRKని ఉక్రెయిన్ హ్యాక్ చేసింది. VGTRKని ఎటాక్ చేయడంతో ప్రధానమైన వెబ్‌సైట్‌తో పాటు 24 గంటలు అందుబాటులో ఉండే రోస్సియా 24 అనే ఛానెల్ కూడా పోయింది.
అంతర్గత సిస్టమ్స్, టెలిఫోన్, ఇంటర్నెట్ సర్వీసులతో పాటు బ్యాకప్ సర్వర్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇది ఉక్రెయిన్ ప్రభుత్వం పుతిన్‌కు ఇచ్చిన పుట్టినరోజు కానుక అంటూ ఉక్రెయిన్ ఎగతాళి చేస్తున్నట్లు ప్రకటించింది. VGTRKపై జరిగిన సైబర్ ఎటాక్ని నిపుణులు విచారణ చేపడుతున్నారని క్రెమ్లిన్ ప్రజాప్రతినిధి మిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. UNESCO వేదికగా ఈ సైబర్ ఎటాక్‌పై రష్యా కచ్చితంగా ఫిర్యాదు చేస్తుందని రష్యా వెల్లడించింది. ఈ సైబర్ దాడిని చూస్తుంటే పశ్చిమ దేశాలన్నీ కలిసి హైబ్రిడ్ యుద్ధానికి తెరలేపుతున్నట్లు అనిపిస్తోందని ఆరోపించింది.