Natti Kumar: ప్ర‌కాష్ రాజ్ ప‌వ‌న్ కాలి గోటికి స‌రిపోడు

producer Natti Kumar slams prakash raj

Natti Kumar: విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కావాల‌నే ప‌వ‌న్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు ప్రముఖ నిర్మాత న‌ట్టి కుమార్. ప్ర‌కాష్ రాజ్ పవ‌న్ క‌ళ్యాణ్ కాలి గోటికి స‌రిపోడ‌ని అన్నారు. కొండా సురేఖ‌, కేటీఆర్ స‌మ‌స్య‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికే ప్ర‌కాష్ రాజ్ కావాల‌ని ట్వీట్స్ చేస్తున్నార‌ని అన్నారు.

“” నాగార్జున కుటుంబం గురించి కేటీఆర్ గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు వంద శాతం త‌ప్పు. అది కోర్టులో వాళ్లు వాళ్లు చూసుకుంటారు. ఈరోజు ఈ విష‌యం గురించి యావ‌త్ సినీ ఇండ‌స్ట్రీ ముందుకొచ్చి మాట్లాడింది. ప‌క్క రాష్ట్రానికి చెందిన ప్ర‌కాష్ రాజ్ కూడా ఏంటీ సిగ్గులేని రాజ‌కీయాలు అంటూ ట్వీట్ చేసారు. ఇదే ప్ర‌కాష్ రాజ్ ఆనాడు రేణూ దేశాయ్ మీడియా ముందు క‌న్నీళ్లు పెట్టుకుని నాకు రాజ‌కీయాల‌కు సంబంధం లేదు అన్న‌ప్పుడు ఏమైపోయారు? అప్పుడెందుకు ఇండ‌స్ట్రీలోని వారు ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు?

పోసాని కృష్ణ ముర‌ళి అంజ‌న‌మ్మ గురించి చాలా త‌ప్పుగా మాట్లాడారు. మ‌రి అప్పుడెందుకు ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు? కేసీఆర్, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాల‌కు మీరు భ‌య‌ప‌డ్డారా? చిరంజీవి జ‌గ‌న్‌కు దండం పెట్టి ఇండ‌స్ట్రీకి కాపాడండి అంటే జ‌గ‌న్ అవ‌మానించిన‌ప్పుడు ఏమైపోయారు? ప్ర‌కాష్ రాజ్ ప‌వ‌న్ కాలి గోటికి కూడా స‌రిపోడు. అలాంటిది ఈరోజు కొత్త బాబా వ‌చ్చాడు అంటూ త‌ప్పుగా మాట్లాడుతున్నారు. ఇదంతా కేటీఆర్, కొండా సురేఖ టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌డానికే. మీరు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎదుర్కోవాలంటే రాజ‌కీయంగా ఎదుర్కోండి. అంతేకానీ కావాల‌ని డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి పాల్ప‌డ‌వ‌ద్దు. ఇలాగే కొన‌సాగితే ప‌వ‌న్ అభిమానులు త‌గిన బుద్ధి చెప్తారు. అప్పుడు వ‌చ్చి అభిమానులు నాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి అంటే కుద‌ర‌దు. ఎందుకంటే అభిమానాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు అని గుర్తుంచుకోండి “” అని వెల్ల‌డించారు.