Guntur: అత్త చెవిని కొరికిన కోడ‌లు.. చెవి ఊడిపోయి అత్త గ‌గ్గోలు

daughter in law bites off mother in law ear in guntur

Guntur: అత్త కోడ‌ళ్ల మ‌ధ్య గొడ‌వ చోటుచేసుకోవ‌డంతో కోడ‌లు అత్త చెవి కొరికేసింది. దాంతో చెవి ఊడి నోటికొచ్చింది. ఈ ఘ‌ట‌న గుంటూరులో చోటుచేసుకుంది. తుళ్లూరులో నివసిస్తున్న కోడలు పావని(30) అత్త నాగమణి(55)కి కుటుంబ కలహాల కారణంగా కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గొడవ జరిగిన సమయంలో కోడలు.. అత్త చెవిని కొరకడంతో చెవి ఊడి పోయింది. అనంతరం తెగిన చెవితో పాటు నాగమణిని స్థానికులు తుళ్లూరు పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్ప‌టికే ఆలస్యం కావడంతో తెగిన చెవి అత్తుకోవడం కష్టమని వైద్యులు చెప్పినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోయారు.