నిర్మాణం జరుగుతున్న భవనంలో టీచర్ విద్యార్థి సెక్స్
Viral News: అమెరికాలో టీచర్లు, విద్యార్థుల మధ్య లైంగిక సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. వారంలో ఇలాంటి ఒక ఘటనైనా వార్తల్లో నిలుస్తోంది. తాజా ఘటనలో 53 ఏళ్ల టీచర్ ఓ మైనర్ విద్యార్థితో నిర్మాణంలో ఉన్న భవనంలో సెక్స్ చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది.
డావెన్‌పోర్ట్ హై స్కూల్‌లో ఆర్ట్స్ టీచర్‌గా పనిచేస్తున్న జెన్నిఫర్ అనే మహిళ అదే స్కూల్‌లో చదువుకుంటున్న మైనర్‌తో ఎఫైర్ పెట్టుకుంది. ఆ అబ్బాయిని నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లడంతో అక్కడి స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.. వారు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జెన్నిఫర్ పారిపోయేందుకు యత్నించగా ఆమెను వెంటనే పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. జెన్నిఫర్‌దే తప్పు అని తేలితే 20 ఏళ్ల కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.
2014 నుంచి 2019 మధ్యలో ఇలాంటివి దాదాపు 500 కేసులు బయటపడ్డాయి. అన్నీ టీచర్, విద్యార్థులకు సంబంధించిన కేసులే కావడం షాకింగ్ విషయం. ప్రతి పది విద్యార్థుల్లో ఒకరికి టీచర్లో లైంగిక ఎఫైర్లు ఉంటున్నట్లు తాజా నివేదికలు చెప్తున్నాయి. టీచర్లను ఎంపికచేసుకునే సమయాల్లో వారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ సరిగ్గా చేయకపోవడం.. మైనర్లకు స్మార్ట్ ఫోన్లు కొనివ్వడం.. సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోవడం ఇలా చాలా కారణాల వల్ల టీచర్లు, విద్యార్థుల పట్ల ఉండాల్సిన పరస్పర గౌరవం కనుమరుగవుతోంది. ఇలాంటి కేసులు పెరగడమే కానీ తగ్గే అవకాశం లేదని అంటున్నారు. దీనిపై ఓ కఠిన సిస్టమ్ తీసుకొస్తే తప్ప ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించదని తల్లిదండ్రులు వాపోతున్నారు.