Women’s T20 World Cup: పాక్‌పై గెలుపు.. సెమీస్‌కి వెళ్లే అవ‌కాశాలు ఎలా ఉన్నాయ్‌?

India Clinch First Win Against Pakistan Must Boost nrr to Stay in T20 World Cup Race

Women’s T20 World Cup: మ‌హిళ‌ల T20 ప్ర‌పంచ క‌ప్‌లో టీమిండియా తొలి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా గెలుపొందింది. అయితే సెమీ ఫైన‌ల్స్‌కి వెళ్లాలంటే టీమిండియా ముందు కొన్ని స‌వాళ్లు ఉన్నాయి.  ప్ర‌స్తుతం టీమిండియాన నెట్ ర‌న్ రేట్ (NRR) -2.90 నుంచి -1.217కి కాస్త మెరుగుప‌డింది. ఇది పాకిస్థాన్‌పై గెల‌వ‌డం వ‌ల్ల వ‌చ్చిన మార్పు.

టీమిండియా కంటే మెరుగైన ర‌న్ రేట్ ఉన్న టీమ్స్ ఇవే

న్యూజిల్యాండ్ (+2.900)
ఆస్ట్రేలియా (+1.908)
పాకిస్థాన్ (+0.555)

అక్టోబ‌ర్ 9న టీమిండియా శ్రీలంక‌తో త‌ల‌ప‌డ‌నుంది. నెట్ ర‌న్ రేట్ పెంచుకోవాలంటే టీమిండియా శ్రీలంక‌పై కేవ‌లం గెలిస్తే సరిపోదు. గ‌ట్టిగా గెల‌వాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నెట్ ర‌న్ రేట్ పెర‌గ‌క‌పోతే ఇత‌ర మ్యాచ్‌ల ఫ‌లితాల‌పై టీమిండియా సెమీ ఫైన‌ల్స్‌కి వెళ్తుందా లేదా అనేది ఆధార‌ప‌డి ఉంటుంది. ఇప్పుడు టీమిండియాకి శ్రీలంక, ఆస్ట్రేలియాపై గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక‌వేళ జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌ల‌లో న్యూజిల్యాండ్ ఆస్ట్రేలియాపై గెలిచినా.. టీమిండియా ఇత‌ర మ్యాచ్‌ల‌లో గెలిచినా సెమీ ఫైన‌ల్స్‌కి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ ఆస్ట్రేలియా న్యూజిల్యాండ్‌పై గెలిస్తే టీమిండియా సెమీ ఫైన‌ల్స్‌కి క్వాలిఫై అయ్యేందుకు ఆస్ట్రేలియా లేదా న్యూజిల్యాండ్ కంటే ఎక్కువ NRR ఉండాలి. ఎల్లుండి శ్రీలంక‌తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ టీమిండియా త‌ల‌రాత ఎలా ఉందో నిర్ణ‌యిస్తుంది.