Sobhita: సమంత పెళ్లికి రెడీ అవ్వలేకపోయా
Sobhita: త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతోంది నటి శోభిత ధూళిపాల. నాగచైతన్య, శోభిత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. మొన్న ఆగస్ట్ 8న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా తన కంటే ముందే పెళ్లి చేసుకున్న తన చెల్లి సమంత ధూళిపాల గురించి మాట్లాడారు శోభిత. సమంత పెళ్లి సమయానికి తాను ఎంతో బిజీగా ఉన్నానని.. అన్ని పనులు దగ్గరుండి చూసుకునే సరికి కనీసం సరిగ్గా రెడీ అవ్వలేకపోయానని అన్నారు. అందంగా తయారైన తన చెల్లిని పెళ్లి పీటలపై చూసినప్పుడు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదని తెలిపారు. ఇక చైతో తన ప్రేమ గురించి చెప్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని.. అలాంటి లక్షణాలు చైలో చాలా ఉన్నాయని తెలిపారు. జీవితంలో తల్లి అవ్వాలనుకోవడం తన కోరికని.. తప్పకుండా పిల్లల్ని కనాలనుకుంటున్నానని అన్నారు.