YS Sharmila: ఢిల్లీ వెళ్తున్న బాబు గారికి ఇదే నా రిక్వెస్ట్
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో APCC చీఫ్ వైఎస్ షర్మిళ చంద్రబాబును ఓ రిక్వెస్ట్ చేసారు.
“” కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్న చంద్రబాబు గారు… విశాఖ స్టీల్ పరిరక్షణపై మీరిచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్ష నేతగా 2021లో అనాడు మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను మళ్ళీ పంపుతున్నాం. ప్రైవేటీకరణ అడ్డుకుంటానని, ప్లాంట్ పూర్వ వైభవానికి కృషి చేస్తామని, అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని, రాశారో లేదో చూసుకోండి. మాట మీద నిలబడే తత్వం మీదైతే, మీరిచ్చిన లేఖకు విలువుంటే, ఇచ్చిన హామీపై మోడీ, అమిత్ షాలను నిలదీయండి. ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరణ అని డిమాండ్ పెట్టండి. ఆంధ్రుల హక్కు ముఖ్యమా? లేదా?
BJPతో పొత్తు ముఖ్యమా ? విశాఖ ఉక్కు ముఖ్యమా ? లేదా NDA లో పదవులు ముఖ్యమా ? మాట మీద నిలబడే సిఎం అవుతారా ? లేక మోసగాడు గా ముద్ర వేసుకుంటారా ? తేల్చుకోండి. కార్మికులకు విజయదశమి కానుకగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను SAILలో విలీనం చేస్తున్నట్లు,14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తున్నట్లు, భూములు కోల్పోయిన 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు, 23 వేల ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా అమ్మేది లేనట్లు, అధికారిక ప్రకటన చేయించాలని, లేకుంటే NDA కూటమి నుంచి వైదొలగాలని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం “” అని రిక్వెస్ట్ చేసారు.