Biggest Flop: 43 కోట్లతో సినిమా తీస్తే లక్ష క‌లెక్ష‌న్

biggest flop film just collected one lakh

Biggest Flop: తీసే ప్ర‌తి సినిమా హిట్ అవ్వాల‌ని లేదు. హిట్ అవ్వ‌క‌పోయినా మ‌రీ నిర్మాత దివాళా తీసేంత న‌ష్టం వ‌స్తే ఆ సినిమా తీసిన వాడికి తీయడం రాద‌నే చెప్పాలి. మ‌న భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ‌లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. కానీ మ‌రీ కోట్లు పెట్టి తీస్తే కేవ‌లం 1 ల‌క్ష క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమా గురించి తెలుసా?

2023 న‌వంబ‌ర్‌లో బాలీవుడ్ నుంచి ఓ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా పేరు ది లేడీ కిల్ల‌ర్. పైగా ఇందులో ముక్కూ మొహం తెలీని వాళ్లు న‌టించారా అంటే అదీ కాదు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌రైన అర్జున్ క‌పూర్.. పేరు తెచ్చుకున్న న‌టి భూమి పెడ్నేక‌ర్‌లు న‌టించారు. సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్పుడు క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది అదో పెద్ద రాడ్డు సినిమా అని. రిలీజ్ అయిన తొలి రోజు కేవ‌లం రూ.70,000 క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. రెండో రోజు రూ.30,000 వచ్చాయి. అలా రూ.43 కోట్లు పెట్టి సినిమా తీస్తే కేవ‌లం రూ.1 ల‌క్ష క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.

దీనిపై ద‌ర్శ‌కుడు అజ‌య్ బెహ‌ల్ స్పందించాడు. సినిమా అస‌లు షూటింగ్ పూర్తికాకుండా రిలీజ్ చేసేసార‌ని.. పైగా ఓటీటీతో కాంట్రాక్ట్ తీసుకుని నేరుగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసారని అన్నారు. క‌నీసం ఇలా ఒక సినిమా వ‌స్తోంద‌ని ప్ర‌మోష‌న్లు కూడా చేయ‌లేద‌ని.. దాంతో జ‌నాల‌కు ది లేడీ కిల్ల‌ర్ అనే సినిమా రిలీజ్ అవుతున్న సంగ‌తి కూడా తెలీకుండాపోయింద‌ని తెగ బాధ‌ప‌డ్డాడు.