Mohammad Kaif: ధోనీ కోసం రూల్ మారుస్తూనే ఉంటారు

rule keep changing for ms dhoni to play says Mohammad Kaif

Mohammad Kaif: మ‌హేంద్ర సింగ్ ధోనీ కోసం IPL గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ పాత రూల్‌ని అమ‌ల్లోకి తీసుకురానుంది. ఈ రూల్ ప్ర‌కారం చాలా కాలం వ‌ర‌కు ఆడ‌కుండా ఉండే ఆట‌గాళ్ల‌ను అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్లుగా రీటైన్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే.. ఈ రూల్ మాములుగా అమ‌ల్లో లేద‌ని.. కానీ ధోనీ కోస‌మ‌ని మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెడుతున్నార‌ని అన్నారు మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్‌. ధోనీ ఆడాల‌నుకున్నంత వ‌ర‌కు ఈ రూల్‌ని మారుస్తూనే ఉంటార‌ని కైఫ్ అన్నారు. అయితే ఈ రూల్ గురించి చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇంకా ధోనీతో మాట్లాడ‌లేద‌ట‌. ఒక‌వేళ ఈ రూల్ ఉన్నా కూడా ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అయితే మాత్రం ఏమీ చేయ‌లేరు. అప్పుడు రూల్‌ని కూడా తీసేసే అవ‌కాశం ఉంది.