AB de Villiers: RCBలోకి రోహిత్ వ‌స్తే కోహ్లీ చూసుకుంటాడు

AB de Villiers reacts on rohit sharma joining rcb

AB de Villiers: 2025 ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు రోహిత్ శ‌ర్మ‌ను తీసుకుంటే బాగుంటుంద‌ని మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ ఆశాభావం వ్య‌క్తం చేసారు. దీనిపై రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ఏబి డివిలియ‌ర్స్ స్పందించారు. “” రోహిత్ శ‌ర్మ బెంగ‌ళూరు టీంలోకా? ఓ మై గాడ్. అదే జ‌రిగితే హార్దిక్ పాండ్య గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియ‌న్స్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు ఎంత పెద్ద వార్త అయ్యిందో అంత‌కంటే పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టిస్తుంది. రోహిత్‌ని ముంబై ఇండియ‌న్స్ వ‌దులుకోదు అనుకుంటున్నా. కాబ‌ట్టి రోహిత్ బెంగ‌ళూరులోకి రావ‌డానికి 0.1 శాతమే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ వ‌చ్చినా కోహ్లీ ఉన్నాడుగా. కోహ్లీ చూసుకుంటాడు “” అని తెలిపారు.