నువ్వే నా ప్రాణం అంటారు.. వేరొకరిని చూసుకుంటారు
Mumbai: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) చాలామంది అమ్మాయి కలల రాకుమారుడు. ఇక సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చాలా పెద్దదే. 80వ దశకంలో సంగీత బిజిలానీ, సోమి అలీ నుంచి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai), కత్రినా కైఫ్ (Katrina Kaif) వరకు చాలా మందితో ప్రేమలో పడ్డాడు సల్మాన్. కానీ ఏ ఒక్క రిలేషన్ కూడా పెళ్లి వరకు రాలేకపోయింది. దీంతో ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటున్నాడు. అయితే ఆయన నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) ప్రమోషన్స్ కోసం కపిల్ శర్మ టాక్ షోలో (Kapil Sharma Talk Show) సందడి చేశారు సల్మాన్. తాజాగా విడుదలైన ప్రోమోలో ‘లైఫ్‌లో మిమ్మల్ని జాన్ (లవర్) అని పిలిచే హక్కు ఎవరికి ఇచ్చారు’ అని హోస్ట్ కపిల్ శర్మ అడగగా దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు సల్మాన్.
తనను జాన్ అని పిలిచే హక్కు ఎవరికీ ఇవ్వనని చెబుతూనే అమ్మాయిలు ప్రేమలో ఎలా వ్యవహరిస్తారో వివరించారు. ‘నీతో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా అదృష్టవంతురాలినంటూ స్టార్ట్ చేస్తారు. కొంత రోజులు గడిచాక ‘ఐ లవ్ యు’ అని చెప్పాక ఇక జీవితం నాశనం అవుతుంది. నువ్వే నా ప్రాణం అంటారు. వేరొకరిని చూసుకుంటారు. ‘జాన్’ అనే పిలుపు ఇన్‌కంప్లీట్ వర్డ్. నేను నీ ప్రాణాన్ని తీస్తాను, మరొకరిని నా ప్రాణంగా చేసుకుంటాను. ఆ తర్వాత అతని జీవితాన్ని కూడా బలి తీసుకుంటాను అనేదే అసలు దానికి అర్థం’ అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రోమోను ‘సల్మాన్ ప్రతి మనిషి తరపున మాట్లాడుతున్నాడు!’ అనే క్యాప్షన్‌తో సోనీ టీవీ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేయగా వైరల్ అయింది.