JR NTR: అనవసరంగా రాజమౌళిపై నింద వేసాం
JR NTR: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో ఏ హీరో అయినా సినిమా చేస్తే.. ఆ తర్వాత ఆ హీరో చేసే సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉంది. సింహాద్రి తర్వాత తారక్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడం.. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన యమదొంగ తర్వాత కూడా తారక్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో ఈ సెంటిమెంట్ ఏర్పడింది.
అయితే.. RRR తర్వాత తారక్ నటించిన దేవర హిట్ అవ్వడంతో ఆ సెంటిమెంట్‌కి గండి పడింది అంటున్నారు. దీనిపై తారక్ మాట్లాడుతూ.. “” అపోహ అంటేనే అబద్ధం. మనం సరిగ్గా సినిమాలు చేసుకోక పాపం రాజమౌళి తరువాత సినిమాలు చేస్తే ఫ్లాప్ అవుతున్నాయి అని ఆయన పైన తోసేసాము. లేని అపోహని ఛేదించాం. మిత్ బ్రేకర్ అని చెప్పుకోవడం బాగుంది “” అని తెలిపారు. ఇక దేవర పార్ట్ 2 గురించి చెప్తూ.. దేవర 2 కోసం స్టోరీ రెడీగా ఉంది. కాకపోతే దానిపై ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉంది. పార్ట్-2ను మరింత పెద్దదిగా ఎలా చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం అన్నారు.