India: భార‌త్‌పై దాడి చేస్తే ఇజ్రాయెల్ లాగా అడ్డుకోలేం

india cannot stop all missile attacks like israel

India: ఇజ్రాయెల్ మాదిరిగా భార‌త్ అన్ని మిస్సైల్ దాడుల‌ను అడ్డుకోలేద‌ని అన్నారు ఎయిర్ మార్ష‌ల్ చీఫ్ అమ‌ర్‌ప్రీత్ సింగ్. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసుకుంటున్న దాడుల నేప‌థ్యంలో అమ‌ర్‌ప్రీత్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఇజ్రాయెల్‌పై మిస్సైల్ దాడులు, మెరుపు దాడులు చేసిన మాదిరిగా భార‌త్‌పై చేస్తే అన్ని దాడుల‌ను ఎదుర్కోలేమ‌ని అన్నారు. ర‌ష్యా నుంచి భార‌త్‌కు రెండు అద‌న‌పు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్స్ రావాల్సి ఉంది. దీని ద్వారా భార‌త్ మిస్సైల్ సామ‌ర్ధ్యాలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

మ‌రోపక్క చైనా త‌న మౌలిక స‌దుపాయాల‌ను క్షేత్ర స్థాయిలో పెంచేసుకుంటోంది. ఇది భారత్‌కు స‌వాల్ లాంటిదే. ఈ నేప‌థ్యంలో భార‌త్ కూడా మౌలిక స‌దుపాయాల‌ను పెంచుకుంటోంది. తూర్పు ల‌ద్ధాక్‌లో కొత్త‌గా ఎయిర్‌పోర్ట్స్ కూడా నిర్మించ‌నున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్స్ కేవ‌లం డిఫెన్స్ శాఖ కోస‌మే క‌డుతున్నారు. ఇక లెబ‌న‌న్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన‌ట్లు భార‌త్ పాకిస్థాన్‌పై దాడులు చేస్తుందా అని అడిగిన ప్ర‌శ్న‌కు అమ‌ర్‌ప్రీత్ స‌మాధాన‌మిచ్చారు.  ఆల్రెడీ బాలాకోట్ స్థావ‌రాల‌పై మెరుపు దాడులు చేసామ‌ని భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుంద‌ని ఇప్ప‌టి నుంచే చెప్ప‌లేమ‌ని అన్నారు. భార‌త వైమానిక ద‌ళానికి మ‌రిన్ని ఫైట‌ర్ జెట్స్ అవ‌స‌ర‌ముంద‌న్నారు. ప్ర‌స్తుతానికి 31 ఫైట‌ర్ జెట్స్ ఉన్నాయ‌ని.. కానీ డిఫెన్స్ శాఖ‌కు మొత్తం క‌నీసం 42 జెట్స్ ఉంటే స‌రిపోతుంద‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌రున్న MiG-21 బైస‌న్, MiG-29, మిరాజ్-2000 ఇంకొన్నేళ్ల‌లో రిటైర్ అయిపోతాయి. ఇక భ‌విష్య‌త్తు ఫైట‌ర్ జెట్స్ కోసం ఇత‌ర దేశాల వైపు చూడ‌కుండా భార‌త్‌లోనే త‌యారు చేసుకునే రోజులు రావాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు. ఇందుకోసం ఎయిర్ ఫోర్స్‌కి కావాల్సిన వ‌న‌రుల‌ను ఆల్రెడీ కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌జేసారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపితే మ‌న‌కు కావాల్సిన‌వన్నీ మ‌న‌మే త‌యారుచేసుకునేందుకు వీలుంటుంది.