bihar cm nitish ఫార్ములా.. బీజేపీని ఓడిస్తుందా?

delhi: ప్రతిపక్షాల ఏకం చేసేందుకు బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌(bihar cm nitish kumar) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్(congress) అగ్రనాయకులు, సీఎం కేజ్రీవాల్‌(kejriwal), తమిళనాడు స్టాలిన్‌(stalin), మాజీ సీఎం ఉద్దవ్‌ ఠాక్రే తదితరులతో మంతనాలు జరిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ(bjp)ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నది వీరి వ్యూహం. అందుకోసం నితీష్ ఓ ఫార్ములాని తీసుకొచ్చారు. దేశంలోని లోకసభ స్థానాల్లో బీజేపీకి పోటీగా ప్రతిపక్షాలకు చెందిన ఒక అభ్యర్థినే నిలబెట్టాలని ఆయన చెబుతున్నారు. అలా చేస్తే ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం అవుతుందని.. ఓట్లు చీలే అవకాశం ఉండదని ఆయన చెబుతున్నారు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనే ఫార్ములాలు.. వివిధ రాష్ట్రాల్లోనే అమలు కాని పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఎంపీ స్థానాలు 543 ఉన్నాయి. అయితే ఇందులో మూడు నుంచి రెండు వందల స్థానాల్లో ఉమ్మడి పార్టీలకు చెందిన అభ్యర్థులను బరిలో దించి… బీజేపీని ఓడించడం మాత్రం పెద్ద కష్టమైన పని కాదు. కానీ అందుకు ఆయా పార్టీలు కలిసి ఏ మేరకు పనిచేస్తాయి అన్నది ప్రధాన సమస్య.

ఒకవేళ నితీష్‌ చెప్పిన ఫార్ములా అమలు చేయాలంటే.. ముందు ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్ నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవ్వాలి. ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాల్లో లోకసభ స్థానాలు కలిపితే దాదాపు 120 ఉంటాయి. దీంతోపాటు బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమైతే.. ఫలితాలు ఉంటాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో అలియన్స్‌ సాధ్యం అవుతుంది. ముందు వీటిపై దృష్టి సారించాలి. అయితే.. యూపీలో అఖిలేష్‌ యాదవ్‌ మాత్రం కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్దంగా లేరు. ఇది ప్రతిపక్షాల ఐక్యతకు దెబ్బే. ఈ పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిస్తే.. బీజేపీ ఓటమి సాధ్యమే కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అవి కలవలేదు. ఇలా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది.