పుట్టగొడుగులు తిని మర్మాంగం కోసేసుకున్న వ్యక్తి
Mushrooms: ఓ వ్యక్తి పుట్టగొడుగులు తిన్నాక వింత ప్రవర్తిస్తూ తన మర్మాంగం తానే కోసేసుకున్నాడు. ఈ ఘటన ఆస్ట్రియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రియాకి చెందిన 35 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో అతను మూడు నెలల క్రితం సిలోసైబిన్ జాతికి చెందిన పుట్టగొడుగులను తిన్నాడు. వీటిని మ్యాజిక్ పుట్టగొడుగులు అని కూడా పిలుస్తారు. ఈ పుట్టగొడుగులను డిప్రెషన్ ట్రీట్మెంట్లో భాగంగా వాడతారు. కానీ దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
అతనికి ఈ పుట్టగొడుగులు స్థానిక మార్కెట్లో దొరకడంతో అవి తెచ్చుకుని వండుకుని తిన్నాడు. అవి తిన్న తర్వాత మరుసటి రోజు నుంచి పిచ్చి పిచ్చి కలలు, హెల్యూజినేషన్లు ఎదురవుతున్నాయట. ఆ హెల్యూజినేషన్ మాయలో తన జననాంగాన్ని తానే కోసేసుకున్నాడు. నొప్పి తెలీడంతో వెంటనే రక్తస్రావాన్ని ఆపేందుకు గుడ్డ ముక్కలు చుట్టుకున్నాడు. పైగా కట్ చేసిన భాగాలను ఓ జార్లో పెట్టాడు. అతను ఆ నొప్పితోనే రోడ్డు మీదకు వచ్చి పడిపోవడంతో ఓ వ్యక్తి గమనించి వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు.
వైద్యులు వెంటనే జననాంగాన్ని కొంత భాగం వరకు అతికించి సర్జరీ చేసారు. ఈ ఘటన జరిగి మూడు నెలలు అవుతోంది. ప్రస్తుతానికి ఆ వ్యక్తి కోలుకుంటున్నాడట. దాంతో ఈ రకమైన పుట్టగొడుగులకు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో పుట్టగొడుగులు తిన్నాక వింతగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఓ ఘటనలో పుట్టగొడుగుల కర్రీని వండిపెట్టగా.. ఓ కుటుంబం మొత్తం అస్వస్థతకు గురై చనిపోయారు. దాంతో పుట్టగొడుగులతో వంట చేసిన యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె తప్పులేదని తెలీడంతో వదిలేసారు. ఇటీవల ఓ వ్యక్తి పుట్టగొడుగులు తిని విమానం ఎక్కి ఎగ్జిట్ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు.