తుపాకీ మిస్‌ఫైర్ కేసు.. గోవింద మాటలు నమ్మేలా లేవంటున్న పోలీసులు
Govinda: బాలీవుడ్ నటుడు గోవిందకు ఇటీవల తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో కాలికి బుల్లెట్ తగిలిన విషయం తెలిసిందే. కలకత్తాకు ఓ కార్యక్రమం కోసం వెళ్తున్న సమయంలో తన వద్దున్న లైసెన్స్‌డ్ తుపాకీని గోవింద పాకెట్‌లో పెట్టుకుంటుండగా అది కింద పడి మిస్‌ఫైర్ అయ్యి కాలికి బుల్లెట్ తగిలింది. దాంతో ఆయన్ను వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును విచారణ చేపడుతూ గోవిందను ఏం జరిగిందని అడిగారు. దీనికి గోవింద చెప్పిన సమాధానాలు నమ్మేలా లేవని పోలీసులు చెప్తున్నారు. గోవింద ఏదో దాస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.