Imran Khan: టిప్పు సుల్తాన్లా చనిపోవాలనుంది
Imran Khan: హెజ్బొల్లా అధినేత నస్రల్లా, హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేలు ఇజ్రాయెల్ దాడుల్లో దుర్మరణం చెందిన నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నస్రల్లా, హనియేలు తమ దేశం కోసం పోరాడుతూ చనిపోయిన అమరవీరులని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని ఆరోపించారు. పాకిస్థాన్ ప్రజలు ఇలాంటి రాజకీయ నాయకులను నమ్ముకుంటే ఏమీ ఉండదని.. ఎవరికి వారు తమ హక్కుల కోసం పోరాడితేనే జీవించ గలుగుతాం అని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తన గురించి మాట్లాడుతూ.. తనని తాను మైసూరు వీరుడైన టిప్పు సుల్తాన్తో పోల్చుకున్నారు. తనకి చావంటూ వస్తే నస్రల్లా, హనియేలా కాకుండా టిప్పు సుల్తాన్లా చనిపోవాలని ఉందని అనడం వైరల్గా మారింది.