CSK: ధోనీ విషయంలో హర్భజన్ అబద్ధాలు చెప్తున్నాడు
CSK: మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో మాజీ క్రికెటర్, కమెంటేటర్ హర్భజన్ సింగ్ అబద్ధాలు చెప్తున్నాడని ఆరోపించింది చెన్నై సూపర్ కింగ్స్. మొన్న జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచిన సంగతి తెలిసిందే. చెన్నైపై గెలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్లామన్న ఆనందంతో టీం అంతా సంబరాలు చేసుకోవడంలో మునిగిపోయారు. దాంతో షేక్ హ్యాండ్ కార్యక్రమానికి ధోనీ అండ్ టీం రెడీగా ఉండగా.. బెంగళూరు టీం సంబరాలు చేసుకోవడంలో మునిగిపోయింది. దాంతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ధోనీ ఫీల్డ్ నుంచి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయారు. అప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. చాలా మంది సీనియర్ క్రికెటర్లు ఇదేనా మర్యాద అంటూ బెంగళూరు టీంపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
దీనిపై హర్భజన్ సింగ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో హర్భజన్ కమెంటేటర్‌గా ఉన్నారు. ధోనీ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లాక కోపంలో అక్కడే ఉన్న స్క్రీన్‌ని చేత్తో బలంగా గుద్దాడని అది తన కళ్లారా చూసానని భజ్జీ అన్నారు. ప్రతి మనిషికి భావోద్వేగాలు, ఫీలింగ్స్ ఉంటాయిని తెలిపాడు. హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే చెన్నై సూపర్ కింగ్స్ దీనిపై స్పందించింది. అసలు ధోనీ అలా స్క్రీన్‌ని బాదలేదని.. హర్భజన్ ఏవేవో ఊహించేసుకుని అబద్ధాలు చెప్తున్నాడని తెలిపింది. అసలు ధోనీలో ఎప్పుడూ అంత కోపం తాము చూడలేదని హర్భజన్ సింగ్ ఎవరి గురించి చెప్తున్నాడో అర్థంకావడంలేదని సూపర్ కింగ్స్ సంస్థ వెల్లడించింది.