Nayanthara: నిన్నెవ‌రు చూస్తారు అని ఎన్టీఆర్ కామెంట్ చేసాడు

Nayanthara reveals interesting details about jr ntr

Nayanthara: టాలీవుడ్‌లో న‌య‌న‌తార ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఆమె న‌టించిన అన్ని సినిమాల్లో ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయిన సినిమా మాత్రం అదుర్స్. జూనియ‌ర్ ఎన్టీఆర్ డ‌బుల్ రోల్‌లో న‌య‌న‌తార‌, షీలా, బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా మొన్న రీ రిలీజ్ అయినా అంతే ఎన‌ర్జీతో ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేసారు. అయితే.. అదుర్స్ షూటింగ్ స‌మ‌యంలో తార‌క్ త‌న‌పై కామెంట్ చేసాడంటూ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు న‌య‌న్.

షూటింగ్ స‌మ‌యంలో న‌య‌న‌తార మాటిమాటికీ ట‌చ‌ప్ చేయించుకుంటున్నార‌ట‌. తాను ట‌చ‌ప్ చేసుకుంటూ లిప్‌స్టిక్ రాసుకుంటూ ఉంటే.. తార‌క్ ప‌క్క‌నే నిల‌బ‌డి అలాగే చూస్తున్నాడ‌ట‌. ఏంటి అలా చూస్తున్నారు అని న‌య‌న్ తార‌క్‌ని అడిగితే..ఎందుకు అంత‌గా మేక‌ప్ వేసుకుంటున్నావ్ అని అడిగాడ‌ట‌. అప్పుడు న‌య‌న్.. షాట్‌లో అందంగా క‌నిపించాలి క‌దా అని స‌మాధానం ఇచ్చింద‌ట‌. దీనిపై తార‌క్ కామెంట్ చేస్తూ.. నువ్వెంత మేక‌ప్ చేసుకున్నా జ‌నాలు నిన్ను చూడ‌రు. న‌న్నే చూస్తారు అన్నాడ‌ట‌. అది విని న‌య‌న్‌తో పాటు సెట్‌లో ఉన్న‌వారు స‌ర‌దాగా న‌వ్వుకున్నార‌ట‌. మ‌న చారీ లుక్, గెట‌ప్ అలాంటిది మ‌రి..!